"నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును." కీర్తన Psalm 34:1-10
పల్లవి : సన్నుతింతు నెప్పుడెహోవాను
తన కీర్తి నా నోట నుండును
1. అతిశయింతు నెహోవానుబట్టి
సంతోషింతురు దీనులు విని
|| సన్నుతింతు ||
2.ఘనపరచుడి దేవుని పేరు
గొప్ప చేయుదము ఏకముగా
|| సన్నుతింతు ||
3. తనయొద్ద నే విచారించగా
తప్పించె నన్ను భయముల నుండి
|| సన్నుతింతు ||
4. తనను చూడగ వెల్గు కలిగెను
తమ ముఖములు లజ్జింపకుండె
|| సన్నుతింతు ||
5. యెహోవా భక్తులందరి చుట్టు
దూత కావలి యుండి రక్షించు
|| సన్నుతింతు ||
6. దేవుడుత్తముడని రుచిచూడు
ధన్యుడు తన్నాశ్రయించువాడు
|| సన్నుతింతు ||
7. ఆకలెత్తు సింహపు పిల్లలకు
ఆశ్రితుల కేమి కొదువలేదు
|| సన్నుతింతు ||
Psalm-34:1-10
Sada Prabhu ko dhanya kahun main
Pallavi : Sannuthinthu neppudehovaanu -
thana keerti naa nota nundunu
1. Athishayinthu nehovaanu batti -
Santhoshinthuru deenulu vini “Sannut”
2. Ghana parachudi devuni peru -
goppa cheyudamu ekamugaa “Sannut”
3. Thana yodda ne vichaarinchagaa -
thappinche nannu bhayamula nundi “Sannut”
4. Thananu choodaga velgu kaligenu -
thama mukhamulu lajjimpa kunde “Sannut”
5. Yehovaa bhaktulandari chuttu -
doota kaavali yundi rakshinchu “Sannut”
6. Devuduthamudani ruchi choodu -
dhanyudu thannaashrainchuvaadu “Sannut”
7. Aakaleththu simphapu pillalaku -
aashrithula kemi koduva ledu “Sannut”