|

854: భూదిగంతముల నివాసులారా | Bhoodigantamula nivaasularaa

  • TELUGU

  • ENGLISH

పల్లవి:
భూదిగంతముల నివాసులారా -
నా వైపు చూచి రక్షణ పొందుడి
యిదియే దేవుని ఆహ్వానము -
యిదియే దేవుని రక్షణ పిలుపు


1. వినిరి అనేకులు ఆ పిలుపును -
లోబడిరి వారు ఆ పిలుపునకు (2)
యేసుని వైపు చూచిరి వారు (2)
రక్షణనొంది ఆనందించిరి
|| భూదిగంతము ||

2. శతృవు దాడికి ఎదిరించి నిలిచిరి -
ప్రార్ధన ద్వారా పోరాడి గెలిచిరి (2)
యేసుని వైపు చూచుచుసాగిరి (2)
ఆత్మతో సత్యముతో ఆరాధించిరి
|| భూదిగంతము ||

3. సుళువుగా చిక్కులు బెట్టు -
పాపమును విడువుడి -
సిలువను సహించి సాక్షులైయుండుడి
విశ్వాసమునకు కర్తయు దాని
కొనసాగించెడు యేసుని చూడుడి
|| భూదిగంతము ||

4. పరిశుద్ధత మీద మీరు -
మిమ్మును కట్టుకొనుడి -
పరిశుద్ధాత్మతో ప్రార్ధన చేయుడి (2)
నిత్య జీవార్ధమైన కనికరమునకై
యేసుని కొరకు కనిపెట్టు చుందుడి
|| భూదిగంతము ||

5. దేవుడను నేనే యనె -
వేరెవ్వరు లేరనెను -
నీతిమంతుడును -
రక్షించు వాడును (2)
యుగయుగములకు -
మహిమ ఘనత
ప్రభావమాయనకే కలుగును గాక
|| భూదిగంతము ||

Similar Posts

  • |

    18: పిల్లలారా నా మాట వినుడి | Pillalara na mata vinudi

    TELUGU ENGLISH PLAY MEDIA “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” కీర్తన Psalm 34:11-18పల్లవి : పిల్లలారా నా మాట వినుడియెహోవా యందు భక్తి నేర్పెదను1. బ్రతుక గోరువాడెవడైన కలడా?మేలునొందుచు చాలా దినములు|| పిల్లలారా ||2. కపటమైన చెడుమాటలాడకకాచుకొనుము నీదు పెదవులను|| పిల్లలారా ||3. కీడు మాని మేలునే చేయుముసమాధానము వెదకి వెంటాడు|| పిల్లలారా ||4. యెహోవా దృష్టి నీతిమంతులపైకలదు వారి మొఱల వినును|| పిల్లలారా ||5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండికొట్టివేయు…

  • |

    861: ఆర్భాటముతోను ప్రభావముతోను | Aarbhatamuthonu prabhaavamuthon

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి :ఆర్భాటముతోను ప్రభావముతోను -మేఘారూడుడై యేసు వేగమే రానుండేఅను పల్లవి :మేల్కొనుమా ప్రియ సంఘమా -సిద్ధపడుమా పరిశుద్ధ జనమా (2)1. పాపముల క్షమియించి శుద్ధి చేసెను -పరలోక పౌరులుగా మనల జేసెను (2)సువార్తను ప్రకటింప ఆజ్ఞ యిచ్చెను -సంఘమును కట్టుమని సెలవిచ్చెను (2)|| మేల్కొనుమా ||2. స్థలమును సిద్ధపరచ వెళ్లెను యేసు -తానుండు స్థలములో మనముండునట్లుగా (2)హృదయమును కలవరపడనియ్యకుయేసునియందు విశ్వాసముంచుమా (2)|| మేల్కొనుమా ||3. పడిపోయిరి మా బలాఢ్యు లెందరో -ఇశ్రాయేలు…

  • |

    849: నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్ | Naa prana priyuda ninne stutintun

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి :నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్నా హృదియారా నిన్నే ఘనపరతున్నా నిరీక్షణకు ఆధారం నీవే (2)ఎల్లకాలం నిన్నే ఆరాధింతున్ (2)”నా ప్రాణ ప్రియుడా…”1. పాపపాశములు నను చుట్టుముట్టి -నిత్యానాశనమునకు చేరువకాగా (2)పావనుడేసు నా కట్లుత్రెంచ (2)సిలువలో బలియాయె.. ఆ .. ఆ ..సిలువలో బలియాయె గొప్ప రక్షణను నాకిచ్చెననికొనియాడెదన్ (2)|| నా ప్రాణ ప్రియుడా ||2. నాదు జీవిత యాత్రలో నాకు -జీవపు వెలుగు నీవైతివి (2)నాదు కష్ట సమయంబులలో…

  • |

    1: దుష్టుల ఆలోచన చొప్పున నడువక | Dustula allochana choppuna

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.” కీర్తన 11. దుష్టుల ఆలోచన చొప్పున నడువకపాపుల మార్గములయందు నిలిచియుండక|| దుష్టుల ||2. అపహాసించునట్టి ప్రజల కూర్చుండెచుఆ చోట కూర్చుండక యుందువాడే ధన్యుడు|| దుష్టుల ||3. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచుయెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు|| దుష్టుల ||4. కాలువ నీటియోర నతడు నాటబడికాలమున ఫలించు చెట్టువలె యుండును|| దుష్టుల ||5. ఆకు వాడని చెట్టువలె నాతడుండునుఆయన చేయునదియెల్ల సఫలమగును|| దుష్టుల ||6. దుష్టజనులు ఆ విధముగా నుండకపొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు|| దుష్టుల…

  • |

    11: యేసు ప్రభూ కాపరి నాకు | Yesu prabhoo kapari naaku

    TELUGU ENGLISH PLAY MEDIA “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23పల్లవి : యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్యేసు గొఱ్ఱెపిల్లను – పోయెదను తన వెంట1. పచ్చిక పట్లకు – మచ్చికతో నడుపున్స్వచ్ఛ జలముచెంత – నిచ్చును విశ్రాంతిముందు ముందు వెళ్లుచు – పొందుగా రక్షించు నన్నుతన మాధుర్య స్వరంబున – తనివి దీర్చును|| యేసు ప్రభూ ||2. మరణపులోయ ద్వారా – సరిగా నడిపించునుఅడవి భయములెల్ల…

  • |

    5: యెహావా నా బలమా | Yehovaa Naa Balamaa

    TELUGU ENGLISH PLAY MEDIA పల్లవి : యెహావా నా బలమా – యధార్థమైనది నీ మార్గం – పరిపూర్ణమైనది నీ మార్గం1. నా శత్రువులు నను చుట్టిననునరకపు పాశములరికట్టిననువరదవలె భక్తిహీనులు పొర్లినవిడువక నను యెడబాయని దేవా|| యెహావా ||2. శమరణపుటురులలో మరువక మొరలిడఉన్నత దుర్గమై రక్షణ శృంగమైతన ఆలయములో నా మొర వినెనుఅదిరెను ధరణి భయకంపముచే|| యెహావా ||3. పౌరుషముగల ప్రభు కోపింపగాపర్వతముల పునాదులు వణికెనుతననోటనుండి వచ్చిన యగ్నిదహించి వేసెను వైరులనెల్ల|| యెహావా ||4. మేఘములపై ఆయన వచ్చునుమేఘములను…