పల్లవి:
నమ్మదగిన మా దేవా
పరిశుద్ధుడా - నీతిమంతుడా (2)
మహామహిమలో వసియించెడు -
మహిమగల మహారాజా (2)
1. పములను మే మొప్పుకొనగా -
క్షమియించితివి నమ్మదగినవాడవై (2)
నీ రక్తముతో ప్రతిపాపమును (2)
కడిగి శుద్ధులుగా చేసిన దేవా (2)
నిన్ను మేము పూజింతుము (2)
|| నమ్మ ||
2. వాగ్దానములిచ్చి నెరవేర్చువాడు -
నమ్మకమైన సత్యసాక్షినై (2)
ఆదియు అంతములేనివాడా (2)
మృతుడై సజీవుడుగా లేచినవాడా (2)
నిన్ను మేము కీర్తింతుము (2)
|| నమ్మ ||
3. శత్రువు మాపై చెలరేగుచుండగా -
అండగా నుండి మమ్మాదుకొంటివే (2)
నీ నమ్మకత్వము మేమెన్న తరమా (2)
మాటతప్పని మహోపకారీ (2)
నిన్ను మేమారాధింతుము (2)
|| నమ్మ ||
4. గాలి తుఫానుల కల్లోలములతో -
మా నావ అలలచే అల్లాడుచుండగా (2)
గాలి తుఫానులు గద్దించితివే (2)
మము దరిచేర్చిన మహానుభావా (2)
నిన్ను మేము స్తుతియింతుము (2)
|| నమ్మ ||
5. పది దినములు శ్రమ కలుగునంటివి -
నమ్మకముగ నుండు మరణమ వరకని (2)
జీవకిరీటము నిచ్చెదననిన (2)
మొదటివాడవు కడపటివాడా (2)
నిన్ను మేము ఘనపరతుము (2)
|| నమ్మ ||
6. పిలిచితివి మమ్ము నీ కుమారుని -
సహవాసమునకు నమ్మదగినవాడవై (2)
పరిశుద్ధమైన పరలోక పిలుపుతో (2)
నీ విశ్వాస్యత బుద్ధి కందే (2)
వందనములు చెల్లింతుము (2)
|| నమ్మ ||
7. వచ్చుచున్నవాడు నమ్మకమైన -
సత్యవంతుడను నామము గలవాడు (2)
దేవుని వాక్యమును నామము గలవాడు (2)
రాజులరాజు ప్రభువుల ప్రభువు (2)
హల్లెలూయ (అమేన్ (2))
|| నమ్మ ||