• TELUGU

  • ENGLISH

  • PLAY MEDIA

పల్లవి:
గుణాతిశయముల నే పాడెదను (2)
స్తుతి ప్రశంస నే చేసెదను (2)
గుణాతిశయముల నే పాడెదను (2)


1. పాప సాగరములో నే మునుగు చుంటి -
నా కన్నీటిని నే త్రాగుచుంటి(2)
నాదు హృదయము బహు వ్యాకుల మొందె (2)
ఆ సమయములో - ప్రభు నాకు దొరికె (2)
నన్నాదరించి - తన యింట చేర్చెను (2)
|| గుణాతి ||

2. హృదయ పాపములన్ని కడిగె రక్తముతో -
నిత్య రాజ్యమునకు పాలివానిగా జేసె (2)
శాంతి ఆనందముతో - ప్రభు నన్ను నింపెను (2)
నిత్య జీవ వరము - నాకనుగ్రహించెను (2)
తన చెంతకు నన్ను - చేర్చెను ప్రభువు (2)
|| గుణాతి ||

3. తిరిగి లేచి ప్రభు వెళ్లెను పరముకు -
సిద్ధపరచుచుండె నాకై స్థలమును (2)
నన్నుకొని పోవ - ప్రభు తిరిగి వచ్చును (2)
విడిపించును నన్ను - ప్రతి దుఃఖము నుండి (2)
ఈ నిరీక్షణతో - జీవించుచున్నాను (2)
|| గుణాతి ||


You may also like