పల్లవి :
(మాదు) ప్రార్థన సమయంబులో - దేవా చెవియొగ్గుము (2)
మాదు కోటయు, మాదు దుర్గం నీవే - నిన్నే మేము ఆశ్రయింతుమ్ (2)
1. యెడతెగక ప్రార్థింప - ప్రార్థనాత్మ వరము నిమ్ము
ఆటంకం తొలగించుము - దయకోరి నిన్ను చేరితిమి (2)
॥ప్రార్థన॥
2. యెడతెగక ధ్యానింప - నీ కృప ననుగ్రహించుమా
నీ వాక్యం వెదకుచుండ - దయతోడ మాకు సెలవిమ్ము
॥ప్రార్థన॥
3. యెడతెగక నిలుచుండ - పరిశుద్ధుల సహవాసములో
నీ యొక్క రాకడ కొరకై - దయతోడ మమ్ము సిద్ధపరచు
॥ప్రార్థన॥
