పల్లవి: మహా దేవుడ వీవే (2)
సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి యేసు నీవే (2)
1. నీదు కార్యముల్ అద్భుతముల్
- గొప్పది నీ ఆలోచన
నీదు సంకల్పం బలమైనది
- సర్వ సృష్టికి కర్తవు నీవే
నీవే సర్వమందు ఉన్నవాడవు (2)
||మహా దేవుడ||
2. గత దినములు స్మరించగా
- గొప్పది నీ విశ్వాస్యత
మమ్ము కాపాడి సంరక్షించితివి
- దయాకిరీటము మాకిచ్చితివి
మమ్ము ఆనందింపజేసితివి (2)
||మహా దేవుడ||
3. విడిచితిమి ప్రత్యక్షతను
- ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి
సంఘ క్రమమును లెక్కచేయక
- ఆత్మీయముగా నష్టపోతిమి
మాదు నెపములను బాపుము
మమ్ము క్షమించి సరిచేయుము (2)
||మహా దేవుడ||
4. రానున్న దినములలో
- స్థిరముగా నుండ దయ చూపుము
నన్ను నీకే అర్పించుకొందున్
- నీదు మాటకు లోబడెదన్
నేడే నాతో మాట్లాడుము (2)
||మహా దేవుడ||
5. మహా మహిమతో వచ్చెదవు
- లోకము నిన్ను చూడ జాలదు
సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము
- ఇతరులను సిద్ధపరచెదన్
నిన్నే బహుమానముగా పొందెదన్ (2)
||మహా దేవుడ||
Pallavi: Maha devuḍa veeve (2)
sarvadarsi - sarvagnani (2),
sarvavyapi- yesu nīve (2)
1. Nīdu karyamul adbhutamul - goppadi nī ālōcana,
nīdu saṅkalpaṁ balamainadi -
sarva sr̥uṣṭiki kartavu nīve
(nive sarvamandu unnavaḍavu - 2)
2. Gata dinamulu smariyinnchaga - goppadi nī visvasyata,
mammu kapaḍi samrakṣhinnchitivi -
daya kirīṭamu makichitivi
(mammu anandimpajēsitivi - 2)
3. Viḍacitimi pratyēkatanu ennōsārlu ninnu duḥkha peṭṭitimi,
sangha kramamunu lekkacēyaka - atmīyamuga naṣṭapotimi,
maadu nepamulanu bapumu
(mammu kṣhaminchi, saricheyumu - 2)
4. Ranunna dinamulalo - sthiramugā nuṇḍa dayachupumu,
nannu nīke arpinnchukondun,
nīdu maṭaku lobaḍedan
(neḍe natho matlaḍumu - 2)
5. Maha mahimato vachedavu - lokamu ninnu chudajaladhu,
sampurṇamuga nannu siddhaparacumu -,
itarulanu siddhaparacedan
(ninne bahumanamuga pondedan - 2)