• TELUGU

  • ENGLISH

  • PLAY MEDIA

"నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము. అవి నాకు త్రోవచూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాసస్థలములకును నన్ను తోడుకొని వచ్చును." కీర్తన Psalm 43:3-5
పల్లవి : నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము
దేవా ... నా ... దేవా

1. నాకు త్రోవచూపునూ - అది నీ నివాస స్థలముకు
నన్ను తోడుకొని వచ్చును - దేవా నా దేవా
|| నీ వెలుగు ||

2. అప్పుడు నీకు సితారతో - స్తుతి గీతము చెల్లింతును
ఓ ... హోసన్నా ... హోసన్నా - దేవా నా దేవా
|| నీ వెలుగు ||

3. ఏల క్రుంగిపోతివి - భీతిన్ విడు నా ప్రాణమా
ప్రీతిన్ ప్రభుని గనుమా - దేవా నా దేవా
|| నీ వెలుగు ||

You may also like