• TELUGU

  • ENGLISH

  • PLAY MEDIA

"వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు." కీర్తన Psalm 49:1-9

పల్లవి : సర్వజనులారా వినుడి - మీరేకంబుగా వినుడి

1. లోక నివాసులారా సామాన్యులు ఘనులేమి
దరిద్రులు ధనికులేమి - సర్వజనులారా వినుడి
|| సర్వజనులారా ||

2. నా హృదయ ధ్యానము పూర్ణ - వివేకమును గూర్చినది
నే పల్కెద జ్ఞానాంశముల - సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

3. గూడార్థాంశము వినెద - చేతబట్టి సితార
మర్మము దెల్పెద నేను - సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

4. నాకై పొంచిన దోషుల - క్రియలు నన్ను చుట్టన్
ఆపదలో భయపడనేల - సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

5. తమ ధన సంపదనుబట్టి - పొగడుకొనెడు వారికి
నేనేల భయపడవలెను - సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

6. ఎవడేరీతినైన నిత్యము బ్రతుకునట్లు
సోదరుని రక్షించలేడు - సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

7. వాని నిమిత్తము దైవ - సన్నిధి ప్రాయశ్చిత్తము
చేయువాడెవ్వడు లేడు - సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||

8. ప్రాణ విమోచన ధనము - బహు గొప్ప దెన్నటికిని
తీరక యుండవలసినదే - సర్వ జనులారా వినుడి
|| సర్వజనులారా ||


You may also like