"యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు." కీర్తన Psalm 23
పల్లవి : యేసు ప్రభూ కాపరి నాకు - వాసిగా స్తుతించెదన్
యేసు గొఱ్ఱెపిల్లను - పోయెదను తన వెంట
1. పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్
స్వచ్ఛ జలముచెంత - నిచ్చును విశ్రాంతి
ముందు ముందు వెళ్లుచు - పొందుగా రక్షించు నన్ను
తన మాధుర్య స్వరంబున - తనివి దీర్చును
|| యేసు ప్రభూ ||
2. మరణపులోయ ద్వారా - సరిగా నడిపించును
అడవి భయములెల్ల - ఎడబాపి రక్షించున్
హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించును
వింతగు ఆయన ప్రేమ సేవలో - సంతోషింతును
|| యేసు ప్రభూ ||
3. శత్రుల ముందాహారం - సంసిద్ధము జేయును
నా గిన్నె నిండించి - పొర్లి పారజేసి
కడిగి కడిగి శుద్ధిచేసి - ఆత్మదానమిచ్చెను
వడిగా ఆయన సాయమున - జయమున వెళ్ళెదను
|| యేసు ప్రభూ ||
Psalm - 23:1
Yishu mera Cherwaha main
Pallavi : Yesu prabhoo kapari naaku - vaasigaa stutinchedan
Yesu gorrepillanu - Poyedanu thanaventa
1. Pachika patlaku - machikato nadupun - swatcha
jalamuchenta - nitchunu vishraanti - mundu mundu
velluchu - pondugaa rakshinchu nannu;
thana maadhurya swarambuna - thanivi deerchunu“Yesu”
2. Marana loya dwaaraa sarigaa nadipinchunu - adavi
bhayamu lella - edabaapi rakshinchun - haththi oththi
katti gaayaa lentho aadarinchunu - vintagu aayana
prema sevalo santoshinthunu “Yesu”
3. Shatrula mundaaharam samsiddamu jeyunu -
naa ginne nindinchi - porli paara jesi-kadigi kadigi
shuddhi chesi - aatma daana mitchenu; vadigaa
aayana saayamuna - jayamuna velledanu “Yesu”