పల్లవి: ప్రభువైన క్రీస్తుకు దాసులారా
పరిపూర్ణమనస్సుతో - ప్రభును
సేవించుడి (2)
అ||ప:తన సన్నిధిలో నిలచుటకును
శ్రద్ధగాను కొలచుటకును మిమ్మును
ప్రభు ఎన్నుకొనెను (2)
1. పాపము వలన గత కాలమున -
సాతానునకు దాసులమై యుంటిమి (2)
పాపక్షమాపణ క్రీస్తులో పొంది -
సాతాను చెరనుండి విడుదల నొంది
ధన్యులమైతిమి - క్రీస్తుకు - దాసులమైతిమి
|| ప్రభు ||
2. మీ తలాంతులని వాదుడి ప్రభుకై -
రెండంతలుగ వృద్ది చేయుడి (2)
నమ్మకమైన నిజ దాసులుగా -
తన పరిచర్య చేయుడి నిరతము
ఘనతను పొందెదరు - మీరు -
తన సన్నిధియందున
|| ప్రభు ||
3. యెహోవానే మీరు సేవించుచుందుడి -
వేరెవ్వరిని ఇక సేవించకుడి (2)
పొలములో పంటలు పండకయున్నను -
సాలలో పశువులు లేకపోయినను
సర్వదా సేవించుచు - మీరు - ప్రభువులో హర్షించుడి
|| ప్రభు ||
4. సర్వము ప్రభుకై అర్పించుకొని -
ఆసక్తిగా తన సేవ చేయుడి (2)
ఘనమైన ఈ గొప్ప భాగ్యము -
గమనము చేయుడి మీ బాధ్యత ఇదే
వ్యర్థము కానేరదు - ప్రభునందు
మీ ప్రతి ప్రయాసము
|| ప్రభు ||
5. ప్రభువు త్వరగా రానైయున్నాడు
నిద్రించువారు విడువబడెదరు (2)
మెళకువగా నుండు దాసులైయుండి - తన
చిత్తమును జరిగించుచుండుడి
జీతము తానిచ్చును - మీకు మీ
క్రియల ప్రతిఫలముగా
|| ప్రభు ||