పల్లవి: దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను -
అశ్రద్ధ చేయకుడి (2)
తనకు పరిచర్య చేయుటకు (1)
మిమ్మేర్పరచుకొనెన్ (2)
1. పవిత్రమైన హృదయముతో -
శుద్ధ మనస్సుతోను (2)
దేవుని సన్నిధిలో నిలుచుంది -
ధూపము వేయుటకు (2)
"మిమ్మేర్పరచుకొనెన్"
|| దేవుడు ||
2. అశ్రద్ధ వలన శాపము నష్టము
లెన్నో పొందితిరి (2)
ఆసక్తితో మీరు పరిచర్య చేసి -
దీవెనలు పొందుడి (2)
"దీవెనలు పొందుడి"
|| దేవుడు ||
3. పూర్ణ మనస్సుతో మిమ్మును మీరే
ప్రతిష్ఠించుకొనుడి (2)
జగత్తు పునాది వేయక ముందే
మిమేర్పరచుకొనెన్ (2)
"మిమ్మేర్పరచుకొనెన్"
|| దేవుడు ||
4. క్రీస్తుకు దాసులమని యెరిగి -
దేవుని చిత్తమును (2)
మనఃపూర్వకముగా జరిగించి -
దేవుని ఘనపరచుడి (2)
"దేవుని ఘనపరచుడి"
|| దేవుడు ||
5. వాని వాని క్రియల చొప్పున
జీతము ప్రభు ఇచ్చును (2)
దేవుని దృష్టికి నీతిమంతులై -
సేవ జేయుడి (2)
"సేవ జేయుడి"
|| దేవుడు ||
6. కోతెంతో విస్తారమాయె -
కోయువారు లేరు (2)
వాక్య ఖడ్గమును చేబూని
లేచి రండి నేడే (2)
"లేచి రండి నేడే"
|| దేవుడు ||