పల్లవి :
నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్
నా హృదియారా నిన్నే ఘనపరతున్
నా నిరీక్షణకు ఆధారం నీవే (2)
ఎల్లకాలం నిన్నే ఆరాధింతున్ (2)
"నా ప్రాణ ప్రియుడా..."
1. పాపపాశములు నను చుట్టుముట్టి -
నిత్యానాశనమునకు చేరువకాగా (2)
పావనుడేసు నా కట్లుత్రెంచ (2)
సిలువలో బలియాయె.. ఆ .. ఆ ..
సిలువలో బలియాయె
గొప్ప రక్షణను నాకిచ్చెనని
కొనియాడెదన్ (2)
|| నా ప్రాణ ప్రియుడా ||
2. నాదు జీవిత యాత్రలో నాకు -
జీవపు వెలుగు నీవైతివి (2)
నాదు కష్ట సమయంబులలో (2)
ఆశ్రయ దుర్గమైతివి.. ఆ .. ఆ ..
ఆశ్రయ దుర్గమైతివి
నాదు కాపరివై జీవ మార్గములు
నడిపితివి (2)
|| నా ప్రాణ ప్రియుడా ||
3. అలలు నన్ను ముంచ జూచినను -
బలుడేసు భయపడ వద్దనెను (2)
తల్లడిల్ల కుండా స్థిరపరచె నన్ను (2)
తన సాక్షిగా నిలిపే .. ఆ .. ఆ ..
తన సాక్షిగా నిలిపే
సజీవ యాగముగా నన్నే నీకు
అర్పించెదన్ (2)
|| నా ప్రాణ ప్రియుడా ||
4. తల్లిదండ్రులు నన్ను విడచినను -
కన్నీళ్లు నా కంట రాలినను (2)
కలవరపడకు అంటివి ప్రభువా (2)
కరుణను జూపితివే .. ఆ.. ఆ ..
కరుణను జూపితివే
కరములు జోడించి పూజించెద నిన్ను
నా ప్రభువా (2)
|| నా ప్రాణ ప్రియుడా ||
5. నిన్ను విడువను ఎడబాయనంటివి -
నీ అర చేతిలో చెక్కిన ప్రభువా (2)
అందరు మరచిన మరువని దేవా (2)
పొగడక యెట్లుందున్ .. ఆ.. ఆ ..
పొగడక యెట్లుందున్
పరిశుద్ధు లందరితో హల్లెలూయా పాడుచు
కీర్తింతున్ (2)
|| నా ప్రాణ ప్రియుడా ||