పల్లవి:
ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము -
శోధింప శక్యముగానిది
యుగ యుగముల నుండి -
తరతరములనుండి - (2)
మరుగైయున్నట్టి మర్మము - (2)
|| ప్రభు ||
1. దేవుని కృపామహాదైశ్వర్యమే -
పాపక్షమాపణ మనకిచ్చెను (2)
ఆయన దయాసంకల్పమే -
మనలను స్వాస్థ్యముగా చేసెను (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా (2)
|| ప్రభు ||
2. ఐశ్వర్య వంతుడు మనయేసు -
దరిద్రుడాయెను మనకొరకే (2)
రిక్తునిగా తన్ను చేసికొనన్ -
పరమును వీడి నరుడాయెను (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా(2)
|| ప్రభు ||
3. అల్పులము మనలను ప్రేమించెను -
సంఘములో అంగములగాజేసెను (2)
నీ ప్రేమ ఐశ్వర్యమంత గొప్పది -
వివరింప మాకు బుద్ధిచాలదే (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా (2)
|| ప్రభు ||
4. ఒక్కప్రభువే అందరికి ప్రభువై -
తనను ప్రార్ధించు వారందరికీ (2)
యూదులని గ్రీకులని భేదములేక -
ఐశ్వర్యవంతుడు కృపచూపను (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా (2)
|| ప్రభు ||
5. దరిద్రులముగా నెంచబడితిమి -
లోకమునకైశ్వర్యమిచ్చు చుంటి (2)
మియేమియులేని వారమైనను -
సమస్తమును కలిగియున్న వారము (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా (2)
|| ప్రభు ||
6. చిక్కులన్ని తొలగించి దరిచేర్చి -
ఒక్కటిగా సంఘమును సమకూర్చి (2)
దిక్కుగా నుండి కాపాడుచుంటివి -
మ్రొక్కుబడి చెల్లించి ఆరాధింతుము (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా (2)
|| ప్రభు ||
7. వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు -
ఐశ్వర్యజ్ఞాన బలములాయనకే (2)
మహిమ ఘనత స్తుతిస్తోత్రముల్ -
యుగయుగములాయనకే హల్లెలూయ (2)
హల్లెలూయా - హల్లెలూయా -
హల్లెలూయా - హల్లెలూయా (2)
|| ప్రభు ||