• TELUGU

  • ENGLISH

  • PLAY MEDIA

పల్లవి:
పొందుచున్నాము - అత్యధిక విజయము
మనలను ప్రేమించిన - యేసుని ద్వారా (2)


1. మనలను ప్రేమించి ప్రాణమిచ్చెను -
మృతిని గెల్చి తిరిగిలేచెను (2)
శత్రువునోడించి విజయమిచ్చెను (2)
పాపము క్షమించి రక్షించుటచే
|| పొందుచు ||

2. వాక్యము ద్వారా బలపరచెను -
విశ్వాసములో స్థిరపరచెను (2)
శరీరము పాపముపై జయముపొంది (2)
తన స్వరూపమునకు మార్చబడుటచే
|| పొందుచు ||

3. పరిశుద్ధులగుటకు మనల పిలిచి -
తన ఆత్మ ద్వారా నడిపించెను (2)
దేవుని పిల్లలమని సాక్షమిచ్చెను (2)
క్రీస్తులో మహిమ పరచబడుటకు
|| పొందుచు ||

4. దేవుని ఇంటిగ కట్టబడుచున్నాము -
సహవాసములో నిలిచి యుండి (2)
సోదర ప్రేమలో వినయ మనస్కులై (2)
ఆశీర్వాదమునకు వారసులమవుటకు
|| పొందుచు ||

5. మన పతనములు పాపములబట్టి -
యింటి గోడలు బీటలు వారెను
మన అతిక్రమమును ఒప్పుకొందుము
లోకము నుండి వేరైన వారమై
|| పొందుచు ||

6. మన ప్రభు యేసు వచ్చుచుండగా -
త్వరగా రమ్మని ఎదురు చూతము (2)
శత్రువును ధైర్యముతో ఎదుర్కొనెదము (2)
వినయ విధేయత కలిగియుండి
|| పొందుచు ||

7. సిద్ధపడుడి దైవ జనమా -
బుద్ధి కలిగిన కన్యకల వలె (2)
సిద్దెలలోన నూనెను గలిగి (2)
మెలకువ కలిగి సిద్ధపాటుతో
|| పొందుచు ||


You may also like