పల్లవి:
నమ్మదగిన దేవా -
నిన్న నేడు నిరతము (2)
ఏకరీతిగ నున్న -
నిన్ను నేను కొలుతును (2)
స్తుతికి పాత్రుడా
స్తోత్రం నీకే ప్రభువా (2)
1. వ్యాధి బాధలు కలిగిన -
విడువవు నన్నెన్నడు -
శ్రమయు శోధన వచ్చిన -
విడువవు నన్నెన్నడు (2)
ఆపద కాలములో నన్ను-
ఆదరించి కాచెదవు (2)
ఎన్నడు విడువవు (2)
|| నమ్మదగిన దేవా ||
2. నా తల్లిదండ్రులు విడచిన -
విడువవు నన్నెన్నడు -
బంధుమిత్రులు ద్వేషించిన -
విడువవు నన్నెన్నడు (2)
శాశ్వతమైన ప్రేమతో -
నన్ను ప్రేమించి నా ప్రభు (2)
విడువక కృప చూపెదవు (2)
|| నమ్మదగిన దేవా ||
3. నా కొరకై తిరిగి వచ్చెదవు -
అనాధగా నన్ను విడువవు (2)
నేను నీతో వుండుటకై -
మహిమ రాజ్యములో చేర్చెదవు (2)
రాజుగా చేసెదవు (2)
|| నమ్మదగిన దేవా ||