పల్లవి :
దేవుని ఆశ్చర్యకార్యములను
అందరు చూడరండి - కీర్తింతుము రండి (2)
1. ఆశ్చర్యపడిరి ఎంతో -
లేచిన ప్రభువున్ చూచి (2)
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి
హల్లెలూయా పాడుడి
|| దేవుని ||
2. ఆశ్చర్య మాటలు పల్కెన్ -
అనేకుల కాశ్చర్యమాయెన్ (2)
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి
హల్లెలూయా పాడుడి
|| దేవుని ||
3. ఆశర్య జ్ఞానమునిచ్చున్ -
ఆలోచన శక్తియునిచ్చున్ (2)
ఆయనన్ ఘనపరిచి స్తుతియించుడి
హల్లెలూయా పాడుడి
|| దేవుని ||
4. ఆశ్చర్యపడిరి ఎంతో -
లేచిన ప్రభువున్ చూచి (2)
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి
హల్లెలూయా పాడుడి
|| దేవుని ||
5. శ్రమనొంది సిలువపై -
మౌనము వహించెనేసు (2)
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి
హల్లెలూయా పాడుడి
|| దేవుని ||
6. క్రీస్తుకై శ్రమనొందుచు -
సహించుము అన్నిటిని (2)
ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి
హల్లెలూయా పాడుడి
|| దేవుని ||
7. ఆశ్చర్యకరుడు పిల్చెన్ -
ఆలకించి రమ్ము వేగమే (2)
అద్భుతములను - అనుభవించి
పాడుము హల్లెలూయా
|| దేవుని ||