పల్లవి:
ఆకాశమందు – నీవుండగ
నేను ఎవరికి – భయపడను (1)
నీవీలోకములో – నాకుండగ
నేను దేనికి – భయపడను (2)
1. శత్రు సమూహము – నన్ను చుట్టిన
సైతానుడు సంహరింప జూసిన (2)
నా సహవాసిగ – నీవుండగ
నేను ఎవరికి – భయపదను (2)
2. వ్యాధులు, కరువులు – శోధనలు
బాధలు దుఃఖము – వేదనలు (2)
మరణము మ్రింగగ – కాంక్షించిన
నేను దేనికి – భయపడను (2)
3. మహిమైశ్వర్యము – వైభవము
మహిమానందము – మారనివి (2)
నా ప్రభు క్రీస్తే – నాకుండగ
నేను ఎవరికి – భయపడను (2)
4. నా తీర్మానము – నే చేసితి
నా ప్రభు యేసును – నమ్మితిని (2)
అనుభవ మిచ్చును – ఆ ప్రభువే
నేను ఎవరికి -భయపడను (2)
5. పడిపోయిన వెను – కంజ వేయక
పశ్చాత్తాపము – పడి అడుగు (2)
నిన్ను క్షమించును – నీ ప్రభువే
నీవు ఎవరికి – భయపడవు (2)
Chorus:
Aakshamandu – neevundaga
nenu evariki – bhayapadanu (1)
Neeveelokamulo – naakundaga
nenu deniki – bhayapadanu (2)
1. Shatru samuhamu – nannu chuttina
saitanudu samharimpa choosina (2)
Naa sahavaasiga – neevundaga
nenu evariki – bhayapadanu (2)
2. Vyadhulu, karuvulu – shodhanalu
baadhalu dukamu – vedanalu (2)
Maranamu mringaga – kankshinchina
nenu deniki – bhayapadanu (2)
3. Mahimaishwaryamu – vaibhavamu
mahimanandamu – maranivi (2)
Naa prabhu kriste – naakundaga
nenu evariki – bhayapadanu (2)
4. Naa teermanamu – ne chesiti
naa prabhu yesunu – nammitini (2)
Anubhava michhunu – aa prabhuve
nenu evariki – bhayapadanu (2)
5. Padipoyina venu – kanja veyaka
pashchattapamu – padi adugu (2)
Ninnu kshaminchunu – nee prabhuve
neevu evariki – bhayapadavu (2)
