పల్లవి: దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు
ధూపంబు వేయుటకు - పరిచర్య చేయుటకు
అలక్ష్యము చేయకుమా -
దేవుని సేవను అశ్రద్ధ చేయకుమా (2)
1. యెరూషలేము ఎడారియాయెను - యూదా
దేశము దిగంబరియాయెను
ద్రాక్షావనములు పాడైపోయెను
అయినను దేవుడు కృప చూపుచుండగా
|| అలక్ష్యము ||
2. విధేయులైయుండుడి క్రీస్తు దాసులారా -
దేవుని చిత్తమును యిలలో జరిగించుచు
చేయుడి ప్రభువుకు - యింపైన సేవ
భయముతో వణకుతో ప్రియుడైన యేసుకు
|| అలక్ష్యము ||
3. ప్రతిష్ఠించుకొనుడి - మిమ్ము ఓ యాజకులారా -
అపోస్తులులు - ప్రవక్తలు - ఓ పెద్దలారా
బాగుచేసికొనుడి - మీ బలిపీఠంబులను
తరుణమిచ్చి యుండగా - తప్పుదిద్దుకొందమా
|| అలక్ష్యము ||
4. వచ్చుచున్నాడేసు - బహుమానము తోడ
ప్రతివాని క్రియకు - వాని జీతమిచ్చుటకు
సిద్ధపడు జీతము - బహుమానము పొంద
కాచుకొమ్ము నీ వంతులో నిలిచి యుండుటకు
|| అలక్ష్యము ||