పల్లవి:
ఆకాశమందు నీవుండగా
నేను ఎవరికి భయపడను
నీవీ లోకములో నాకుండగా
నేను దేనికి భయపడను (2)
1. శత్రుసమూహము నన్ను చుట్టినా
సైతనుడు సంహరింపజూసినా (2)
నా సహవాసిగా నీవుండగా
నేను ఎవరికి భయపడను (2)
||ఆకాశమందు||
2. వ్యాధులు కరువులు శోధనలు
బాధలు దుఃఖము వేదనలు (2)
మరణము మ్రింగగ కాంక్షించినా
నేను దేనికి భయపడను (2)
||ఆకాశమందు||
3. మహిమైశ్వర్యము - వైభవము,
మహిమానందము - మారనివి (2)
నా ప్రభు క్రీస్తే - నాకుండగ
నేను ఎవరికి - భయపడను (2)
||ఆకాశమందు||
4. నా తీర్మానము - నే చేసితి
నా ప్రభు యేసును - నమ్మితిని (2)
అనుభవ మిచ్చును - ఆ ప్రభువే
నేను ఎవరికి -భయపడను (2)
||ఆకాశమందు||
5. పడిపోయిన వెనుకంజ వేయక
పశ్చాత్తాపము పడి అడుగు (2)
నిను క్షమియించును నీ ప్రభువే
నీవు ఎవరికి భయపడకు (2)
||ఆకాశమందు||