పల్లవి :
ఇదిగో మనుష్యుల మధ్యన
దేవాది దేవుడు
వాసము చేయుచుండె (2)
1. తాను కాపురముండు స్థలము
తన స్వంత ప్రజల మధ్యనే (2)
దేవుడు తానే వారి దేవుడై యుండి
ప్రతి భాష్ప బిందువు తుడుచున్ (2)
|| ఇదిగో ||
2. దేవుని ఆలయమాయనే
ప్రజ్వలించు దీపము ఆయనే (2)
జీవ జలములతో వారి దాహమును
తీర్చు జీవనది ఆయనే (2)
|| ఇదిగో ||
3. పూర్ణ మహిమతో నిండినది
మహా పరిశుద్ధ స్థలమదియే (2)
స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో
మా పాదముల్ నిలిపెదము (2)
|| ఇదిగో ||
4. సీయోను నీ గుమ్మములను
నీ దేవుడు ప్రేమించెను (2)
పరిపూర్ణమైన నిత్య సువార్తను
ప్రకటింప నిన్నుధరించెను (2)
|| ఇదిగో ||