• TELUGU

  • ENGLISH

  • PLAY MEDIA

పల్లవి :
ఆర్భాటముతోను ప్రభావముతోను -
మేఘారూడుడై యేసు వేగమే రానుండే

అను పల్లవి :
మేల్కొనుమా ప్రియ సంఘమా -
సిద్ధపడుమా పరిశుద్ధ జనమా (2)


1. పాపముల క్షమియించి శుద్ధి చేసెను -
పరలోక పౌరులుగా మనల జేసెను (2)
సువార్తను ప్రకటింప ఆజ్ఞ యిచ్చెను -
సంఘమును కట్టుమని సెలవిచ్చెను (2)
|| మేల్కొనుమా ||

2. స్థలమును సిద్ధపరచ వెళ్లెను యేసు -
తానుండు స్థలములో మనముండునట్లుగా (2)
హృదయమును కలవరపడనియ్యకు
యేసునియందు విశ్వాసముంచుమా (2)
|| మేల్కొనుమా ||

3. పడిపోయిరి మా బలాఢ్యు లెందరో -
ఇశ్రాయేలు నీ సుందర పర్వతముపై (2)
మంచైననూ, వానైన కురువదింకనూ
పర్వతములన్నియూ పాడైపోయెను (2)
|| మేల్కొనుమా ||

4. యెట్లు వెళ్ళేనో యేసు అట్లే వచ్చును -
ప్రతి నేత్రము ఆయనను చూచును (2)
భూజనంబులెల్ల రొమ్ము కొట్టుకొందురు -
సిగ్గుతో ముఖములెల్ల తెల్లబారును (2)
|| మేల్కొనుమా ||

5. ఆయన ప్రత్యక్షత నపేక్షించుమా -
పానార్పణముగా పోయబడుదుమా (2)
నిందలను శ్రమలను సహియింతుమా -
నీతికిరీటము పొంద పోరాడుదమా (2)
|| మేల్కొనుమా ||


You may also like