• TELUGU

  • ENGLISH

  • PLAY MEDIA

పల్లవి :
అదిగో వచ్చియున్నాను -
మరల వచ్చుచున్నాను
ఇదిగో నేను వచ్చుచున్నాను -
త్వరగా వచ్చుచున్నాను (2)


1. అదిగో నేను వచ్చియున్నాను -
మొదటిసారి పాపుల కొరకై (2)
పాపులన్ పిలచి యుంటిని -
పావన రక్తం కార్చితిని (2)
ప్రాణము అర్పించి రక్షింపన్
పరమ ధన్యత నిచ్చెదను (2)
|| అదిగో ||

2. ఇదిగో నేను వచ్చుచున్నాను -
రెండవ సారి పరిశుద్ధులకై (2)
మహిమ ప్రభావముతోను -
మేఘరూఢుడనై దూతలతో (2)
మధ్యాకాశమున సంధించి -
మహిమ రాజ్యము నిచ్చెదను (2)
|| అదిగో ||

3. ఇదిగో తిరిగి వచ్చుచున్నాను -
నాయందు విశ్వాసించిన వారిని (2)
నా తండ్రి ఇంట చేర్చెదను -
నిత్య నివాసిగ జీవింపన్ (2)
నేనే మార్గము, సత్యమును -
నేనే జీవము ద్వారమును (2)
|| అదిగో ||

4. ఇదిగో నేను సమస్తమును -
నూతనమైనవిగా చేసెదను (2)
నూతన ఆకాశము భూమి -
నూతన యెరుషా లేములో (2)
మీతో కాపురముండుటకై -
మీకు తోడైయుండెదను (2)
|| అదిగో ||

5. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను -
ఎవని క్రియల ఫలితమునివ్వ (2)
ధన్యులైన మీకు జీతమును -
దాసులైన మీకు కిరీటమును (2)
ఆత్మయు పెండ్లికుమార్తెయు -
రమ్ము అని చెప్పుచున్నారు (2)
|| అదిగో ||


You may also like