పల్లవి :
పరిశుద్ధ స్థలము - అతి పరిశుద్ధ స్థలము (2)
దేవాదిదేవుడున్నట్టి స్థలము (2)
అతి పరిశుద్ధంబైన పరలోకము (2)
1. ప్రభు యేసు వచ్చెను ఆ స్థలమునుండియే -
స్థలము లేనివాడుగా ఈ భువిపై నుండెను (2)
ప్రాణము నర్పించెను కలువరి కొండపై (2)
శత్రు గర్వమణచను సజీవుడై లేచెను (2)
|| పరిశుద్ధ ||
2. ప్రభుయేసు వెళ్లెనటకు స్థలము సిద్ధపరచను -
ఆయనుండు స్థలములో మనముండవలెనని (2)
శోధన వేదన భాద లేని స్థలమది (2)
ఆ స్థలమునకెళ్లుటకు ప్రయాసపడుదమా (2)
|| పరిశుద్ధ ||
3. అబ్రహాము చూచెను ఆ స్థలమును -
మోషే చూచి వచ్చెను దాని వైభవంబును (2)
హానోకు ఏలీయాలు వెళ్లిరి అటకు (2)
పౌలు చూచి వచ్చెనా మహిమకర స్థలమును (2)
|| పరిశుద్ధ ||
4. సూర్యచంద్రులక్కర లేని స్థలము అది -
పాపము చీకటి చొరని శుద్ధ స్థలమది (2)
గొర్రెపిల్ల దీపమై వెలుగునిచ్చు నచట (2)
జయశాలులెల్లరూ సంచరింతురచట (2)
|| పరిశుద్ధ ||
5. జీవవృక్షఫలములు దొరకునట్టి స్థలమది -
జీవనది పారుచుండు నెల్లవేళలా (2)
నిశేధించ బడినవారు చొరని స్థలమది (2)
నిత్యజీవమొందువారే ప్రవేశింతురందున (2)
|| పరిశుద్ధ ||
6. పండ్రెండు పునాదుల పట్టణము అది -
పండ్రెండు ముత్యములతో కట్టబడినది (2)
పండ్రెండు గుమ్మముల ప్రాంగణమది (2)
హల్లెలూయ పాడుచూ ఆరాధింతుమచట (2)
|| పరిశుద్ధ ||