పల్లవి:
ఆహా ఆనందమే పరమానందమే
ప్రియ యేసు నొసగె నాకు
కొలత లేనిది బుద్ధికందనిది
ప్రేమన్ వివరింప వీలగునా
||ఆహా||
1. నీచ ద్రోహినైన నన్
ప్రేమతో చేర్చుకొనే (2)
పాప ఊభి నుండి నన్
పైకి లేవనెత్తెను (2)
||ఆహా||
2. నలిగిన రెల్లువలే
నేను విరిగెడు సమయములో(2)
నాకై విజ్ఞాపన చేసి
స్థిరపరచితివి ప్రేమతో (2)
|| ఆహా ||
3. కారు చీకటివేళలో
కలత చెందిన నన్ను (2)
కాచి ఓదార్చితివే
బలమైన నీ ఆత్మతో (2)
|| ఆహా ||
4. నాడు ప్రాణనాధుడా
నిన్నెప్పుడు నే గంతునో (2)
ఆత్మప్రియుడా నిన్ను
చూడ ఆశ నాలో కలిగెను (2)
|| ఆహా ||
5. నీ ప్రేమ స్వరమున్ విని
నేను మేలుకొంటిని (2)
ప్రియుని రొమ్మును చేరను
నాలో వాంఛ ఉప్పొంగుచుండె (2)
|| ఆహా ||