• TELUGU

  • ENGLISH

పల్లవి :
క్రీస్తేసు ప్రభుని విశ్వాసులముగా -
కడముట్టించెదము ఈ జీవితయాత్ర (2)
తానుండు చోటనే మనముండెదము (2)
ఇదియే మన మహిమ నిరీక్షణ (2)


1. తానే మార్గం, సత్యం జీవమును -
తన ద్వారానే పరదైసును చేరెదము (2)
పరమునకు వెళ్లినాడు మన స్థలము సిద్ధపరచ
రానైయున్నాడు మరల మనల కొనిపోవుటకు (2)
|| క్రీస్తేసు ||

2. విడువడు మనల అనాథలనుగ నెప్పుడు -
మనలో ఉండి మనతో నివసించును (2)
పాటింతుము ఆజ్ఞలు ప్రేమింతుము తండ్రిని
ప్రభువును ఎదుర్కొన సిద్ధముగా నుండెదం (2)
|| క్రీస్తేసు ||

3. ప్రభురాకడ సమయం సమీపించుచున్నది
ప్రొద్దుగ్రుంకు వేళనో అర్థరాత్రి వేళనో (2)
తెల్లవారు జామునో ఎరుగరు ఎవ్వరు
జాగురుకులమైయుండి మేల్కోని ప్రార్థింతుము (2)
|| క్రీస్తేసు ||

4. ప్రభువేతెంచును ప్రభావముతో మహిమతో
మేఘారూఢుడై వచ్చుట చూచెదము (2)
తన ప్రత్యక్షత అపేక్షించు వారికి
అనుగ్రహించును నీతికీరీటము (2)
|| క్రీస్తేసు ||

5. ఎంత గొప్ప భాగ్యము ఆ పరమ నివాసము-
నిత్యమైన మహిమలో దైవ సహవాసము (2)
వెలలేని క్రయమిచ్చి వారసులుగా జేసితివి
చెల్లింతుము ప్రభు కృతజ్ఞతాస్తోత్రములు (2)
|| క్రీస్తేసు ||


You may also like