పల్లవి:
విజయులం - ఘన విజయులం (2)
క్రీస్తేసు ప్రభువులో అత్యధిక విజయులం (2)
1. పరమును వీడి ధరకేతెంచి -
మరణించితివి కలువరి సిలువలో (2)
నీతి మంతులుగా మము తీర్చితివి (2)
నూతన జీవము మాకిచ్చినందున
|| విజయులం ||
2. మరణ బలము నుండి విడిపించితివి -
మరణ భయములను తొలగించితివి (2)
మరణము గెల్చి తిరిగి లేచితివి - (2)
సమాధి నిన్ను గెలువకపోయెను
|| విజయులం ||
3. శత్రు సైతానును ఓడించి -
నీ సంఘమును నిర్మించితివి (2)
పాతాళ ద్వారముల్ నిలువకుండా - (2)
నీ సంఘమును కాపాడుచుంటివి
|| విజయులం ||
4. గొల్యాతు లెందరో హేళన చేసిరి -
బబులోను రాజులు పైపైకి లేచిరి (2)
కనానీయులు కత్తులు దూసిన - (2)
యెరూషలేమును కాయుచున్న దేవా
|| విజయులం ||
5. శ్రమయు బాధ హింస యైనను -
కరువు వస్త్ర హీనత యైనను (2)
ఉపద్రవమైనను ఖడ్గమైనను - (2)
యెడ బాపునా మమ్ము యేసు ప్రేమ నుండి
|| విజయులం ||
6. లోకము శరీరము దాడి చేయుచుండగా -
లోకమున్ జయించిన విజయశాలివి (2)
లోకస్థులపై విజయము నిచ్చి - (2)
విజయ విశ్వాసులుగా చేసిన దేవా
|| విజయులం ||
7. మహా గొప్ప మహిమతో మరల వచ్చెదవు -
శత్రువు సేనలు కలవరపడగా (2)
నీ రాజ్యమును భువిపై నిలిపి - (2)
మమ్మేలు దేవా యుగా యుగములు
|| విజయులం ||