పల్లవి:
వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా (2)
దీన మనస్సుతో - నిన్నే కొలుతునయ్యా (2)
1. నే ఘోర పాపిని - అయుండగానె
నా కొరకై క్రీస్తు - ఈ భువికరుదెంచె (2)
నన్ను రక్షించుటకై సిలువలో మరణించె (2)
తన రక్తముతో నా పాపము కడిగె (2)
|| వేవేల ||
2. నీ హృదయములో - కలవర పడనీయక
నీ కొరకు నేను స్థలము సిద్ధపర్చ (2)
వెళ్లుచున్నాననిన - నా యేసు ప్రభువా (2)
వాగ్దానమును - ఇచ్చిన ప్రభువా (2)
|| వేవేల ||
3. పూర్ణ హృదయముతో - నిన్నారాధింతును
పూర్ణ మనస్సుతో - నిన్నే సేవింతును(2)
కృతజ్ఞతా స్తుతులు - నీకే చెల్లింతును (2)
హృదయమారా నిన్నే సేవింతును (2)
|| వేవేల ||