పల్లవి:
దేవునికి సమస్తమును సాధ్యమే (2)
అను పల్లవి:
నా కార్యము సఫలము చేయు దేవునికి
నేను మొరపెట్టుచున్నాను (2)
యుద్ధము మీరు కాదు (2)
దేవుడే జరిగించును (1)
1. రక్షణమార్గము స్థిరపరచెన్
నమ్ముట నీ వలనైతే (2)
నీ పాపముల కొరకై యేసు
సిలువలో బలియాయెనుగా (2)
నేడే విశ్వసించిన (2)
పొందెదవు రక్షణ (1)
2. దైవ మర్మములు తెలిపెన్
మారుమనస్సు వలన (2)
పరిశుద్ధాత్మను పంపి మనలను
పరిపూర్ణులుగా చేసిన్ (2)
సిద్ధముగా నుండిన (2)
నిత్యరాజ్యము చేరెదవు (1)
3. సంఘములో అంగముగా
సహవాసిగ చేసెన్ (2)
ప్రతి అవసరత కొరకై
మనలను ప్రార్థించమని కోరెన్ (2)
సంఘముగా నుండిన (2)
పొందెదవు ఫలితము(1)
4. విశ్వాసముతో మీరు
స్థిరముగ నిలిచిన యెడల (2)
యుద్ధశూరుడు యెహోవాయే
మన పక్షమున నిలుచున్ (2)
ధైర్యముతో నుండిన (2)
నిశ్చయము విజయము(1)
Chorus:
Devaniki samastamunu saadhyame (2)
Pre Chorus:
Na kaaryamu safalamu cheyu devaniki
nenu morapettuchunnanu (2)
Yuddhamu meeru kaadu (2)
devude jariginchunu (1)
1. Rakshanamaargamu sthiraparachenu
nammuta nee valanaite (2)
Nee paapamula korakai Yesu
siluvalo baliyayenuga (2)
Nede vishwasinchu (2)
pondedavu rakshana (1)
2. Daiva marmamulu telipenu
maarumanassu valana (2)
Parishuddhaathmanu pampi manalanu
paripoornuluga chesin (2)
Siddhamuga nundina (2)
nityaraajyam cheredavu (1)
3. Sanghamulo angamuga
sahavaasiga chesin (2)
Prathi avasarata koraki
manalanu praarthinchanani koren (2)
Sanghamuga nundina (2)
pondedavu phalithamu (1)
4. Vishwasamuto meeru
sthiramuga nilichina yedala
Yuddhashoorudu Yehovaye
mana pakshamuna niluchun (2)
Dhairyamuto nundina (2)
nishchayamu vijayamu (1)
