పల్లవి:
దేవునికి సమస్తమును సాధ్యమే (2)
అ.ప : నా కార్యము సఫలము చేయు -
దేవునికి నేను మొరపెట్టుచున్నాను (2)
యుద్ధము మీరు కాదు (2)
దేవుడే జరిగించును
దేవునికి సమస్తమును సాధ్యమే (2)
1. రక్షణమార్గము స్థిరపరచెన్ -
నమ్ముట నీ వలనైతే (2)
నీ పాపముల కొరకై యేసు -
సిలువలో బలియాయెనుగా (2)
నేడే విశ్వసించిన (2)
పొందెదవు రక్షణ (1)
|| దేవునికి ||
2. దైవ మర్మములు తెలిపెన్ -
మారుమనస్సు వలన (2)
పరిశుద్ధాత్మను పంపి మనలను -
పరిపూర్ణులుగా చేసిన్ (2)
సిద్ధముగా నుండిన (2)
నిత్యరాజ్యము చేరెదవు (1)
|| దేవునికి ||
3. సంఘములో అంగముగా -
సహవాసిగ చేసెన్ (2)
ప్రతి అవసరత కొరకై మనలను -
ప్రార్థించమని కోరెన్ (2)
సంఘముగా నుండిన (2)
పొందెదవు ఫలితము (1)
|| దేవునికి ||
4. విశ్వాసముతో మీరు -
స్థిరముగ నిలిచిన యెడల (2)
యుద్ధశూరుడు యెహోవాయే -
మన పక్షమున నిలుచున్ (2)
ధైర్యముతో నుండిన (2)
నిశ్చయము విజయము
|| దేవునికి ||