పల్లవి:
మానవా మరలి రా
ప్రభు చెంతకు చేరవా?
ప్రభు పిలిచే తరుణములోన -
రక్షించు నిను నేదైనా (2)
హృదయములో నెమ్మది లేక -
వేసారి విసిగిన బ్రతుకా (2)
కడసారి నిరీక్షణ ఇదియే -
యేసయ్య కలువరి సిలువే (2)
|| మానవా ||
చుట్టుముట్టాయి వ్యాధులు వరుస
దిక్కుతోచని మరణపు పడక (2)
కడసారి నిరీక్షణ ఇదియే -
యేసయ్య కలువరి సిలువే (2)
|| మానవా ||
పాప భారము తోడ నిండి -
పగిలి పోతున్న నీ జీవ పాత్ర (2)
కడసారి నిరీక్షణ ఇదియే -
యేసయ్య కలువరి సిలువే (2)
|| మానవా ||
నా కత్తికి ఎదురులేదని -
విర్రవీగి తిరుగుచునుంటే (2)
గర్వంబు నణచును యేసు -
విరిగిన హృదయముతో తిరుగు (2)
|| మానవా ||
కల్వరిలో నీ కొరకేసు -
రుధిరంబు చిందించినాడు (2)
జాలిగ పిలిచే నిను ప్రభువు -
విలువైన రక్షణ నివ్వ (2)
|| మానవా ||