"ఇదిగో ఈ మనుష్యుడు"
(యోహాను 19 : 5)
పల్లవి:
ఇదిగో ఈ మనుష్యుడు - దేవుని కుమారుడు
పరము నుండి ధరణికి - నరుడై అరుదెంచిన
పరిశుద్ధ దేవుడు - హల్లెలూయ -
శ్రీయేసునాధుడు
1. ఆద్యంత రహితుడు అల్ఫా ..... ఓమేగా తానే
ఆదిసంభూతుడు - అసమానుండైన క్రీస్తు -
సర్వలోకమునకై గొర్రెపిల్లగ బలియై -
మృతుల నుండి లేచిన సజీవుడు
|| ఇదిగో ||
2. భూమ్యాకాశముల కర్త - భూజనుల రక్షణకర్త
సర్వసృష్టి కర్త - సమాధాన కర్త -
పాపవిముక్తికై - రక్తము చిందింప
అభిషిక్తుడైన క్రీస్తేసుడు
|| ఇదిగో ||
3. ఈ ప్రభువే స్తోత్రార్హుడు - ఆరాధనకు పాత్రుడు
రాజుల రాజు యేసు - ఎబినేజరై యున్నాడు
నజరేయుండగు యేసు - విజయుండైలేచెను
నిజరక్షకుండని భజియింతుము
|| ఇదిగో ||
4. తండ్రి మహిమను విడచెను - మరణ పధమున నడిచెను
శ్రీమంతుడైన ప్రభువు - మనకై దరిద్రుడాయెన్
మారుమనస్సు పొంద - కనికరమున మన్నించి
నీతిగతీర్చిన ప్రేమామయుడు
|| ఇదిగో ||
5. రారాజై రానున్నాడు - యుగయుగముల రాజ్యమేలన్
న్న్యాయాధిపతిగ వచ్చున్ - అందరికీ తీర్పు తీర్చన్
ఇహపరములకు - ఘనతమహిమలకు
ప్రభువుల ప్రభువనుచు ప్రణుతింతుము
|| ఇదిగో ||