• TELUGU

  • ENGLISH

  • PLAY MEDIA

పల్లవి:
అర్పింతు ప్రభువా నా జీవితం -
సామర్థ్యము గల నీ చేతిలో
నిన్ను మహిమ పరచ -
అర్హపాత్రగా చేయుము నన్ (2)


1. నే మట్టిని నీవు కుమ్మరివి -
నీ సామర్థ్య హస్తముతో లేపు (2)
అయోగ్యతలన్నీ తొలగించి -
నీ కోర్కె చొప్పున నన్ను చేయు
నిన్ను మహిమపరచ గోరితిన్ ప్రభువా,
యోగ్య పాత్రగ చేయుము నన్ (2)
|| అర్పింతు ||

2. నే నిష్ఫల అంజూరపు చెట్టున్ -
నా చుట్టూ కంచెను కోల్పోతిన్ (2)
కానరాలేదు ఫలమేమి నాలో -
వ్యర్థపరచితిని భూమిన్
నా చుట్టూ త్రవ్వి ఎరువేయుము ప్రభువా,
ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము (2)
|| అర్పింతు ||

3. నే అణచబడిన చిన్న చెట్టున్ -
ముండ్ల పొదల మధ్య పడితిన్ (2)
ధనసుఖ ఆశల ద్వారా - అణచబడితిని నేను
నానుండి ముండ్లను తీయుము ప్రభువా,
నూరంతలుగా నే ఫలియింప (2)
|| అర్పింతు ||

4. నా యెడల శాంతము చూపితివి -
మరి యొక్క వత్సరమిచ్చితివి (2)
తోట మాలిగా నాకై వేడితివి -
తప్పించితివి తీర్పునుండి
వ్యర్థతీగెలను నరికి వేయు ప్రభువా,
నే ఫలియించి నిను ఘనపరచ (2)
|| అర్పింతు ||


You may also like