పల్లవి:
భూదిగంతముల నివాసులారా -
నా వైపు చూచి రక్షణ పొందుడి
యిదియే దేవుని ఆహ్వానము -
యిదియే దేవుని రక్షణ పిలుపు
1. వినిరి అనేకులు ఆ పిలుపును -
లోబడిరి వారు ఆ పిలుపునకు (2)
యేసుని వైపు చూచిరి వారు (2)
రక్షణనొంది ఆనందించిరి
|| భూదిగంతము ||
2. శతృవు దాడికి ఎదిరించి నిలిచిరి -
ప్రార్ధన ద్వారా పోరాడి గెలిచిరి (2)
యేసుని వైపు చూచుచుసాగిరి (2)
ఆత్మతో సత్యముతో ఆరాధించిరి
|| భూదిగంతము ||
3. సుళువుగా చిక్కులు బెట్టు -
పాపమును విడువుడి -
సిలువను సహించి సాక్షులైయుండుడి
విశ్వాసమునకు కర్తయు దాని
కొనసాగించెడు యేసుని చూడుడి
|| భూదిగంతము ||
4. పరిశుద్ధత మీద మీరు -
మిమ్మును కట్టుకొనుడి -
పరిశుద్ధాత్మతో ప్రార్ధన చేయుడి (2)
నిత్య జీవార్ధమైన కనికరమునకై
యేసుని కొరకు కనిపెట్టు చుందుడి
|| భూదిగంతము ||
5. దేవుడను నేనే యనె -
వేరెవ్వరు లేరనెను -
నీతిమంతుడును -
రక్షించు వాడును (2)
యుగయుగములకు -
మహిమ ఘనత
ప్రభావమాయనకే కలుగును గాక
|| భూదిగంతము ||