పల్లవి:
దేవుడు చేసిన పనియైయున్నాము (1)
క్రీస్తునందు ఆయన చేసిన పనియైయున్నాము (2)
1. ఆదాము నిబంధనను భంగము చేసిన –
దోషము వలన మరణ దాస్యములో నుండగా (2)
దేవుని కుమారుడు గొట్టెపిల్లయై (2)
ప్రాణమిచ్చి ప్రాయశ్చిత్తము చేసెను (1)
2. ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండి
నిట్టూర్పులతో మూలుగు లిడుచు మొఱ్ఱపెట్టగ (2)
పరలోకము నుండి దిగివచ్చి దేవుడు (2)
విడిపించి వారిని నడిపించెను (1)
3. అపరాధములచే పాపములచే చచ్చిన వారమై
ఉగ్రత పాత్రులమై యుంటిమి (2)
దేవుడు తన మహా ప్రేమ చేత (2)
క్రీస్తుతో కూడ బ్రతికించెను (1)
4. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి
రక్తము ద్వారా
అపరాధములను క్షమియించెను (2)
దేవుని చిత్తమయిన సంకల్పమును బట్టి (2)
తన స్వాస్థ్యముగా ఏర్పరచెను (1)
5. దూరస్థులైన మనల క్రీస్తుయేసు నందు
రక్తము వలన సమీపస్తులుగా చేసెను (2)
మద్యపు గోడను పడగొట్టి మనల (2)
ఇశ్రాయేలుతో ఏకము చేసెను (1)
6. క్రీస్తుయేసు ముఖ్యమైన
మూలరాయియై యుండగా
అపోస్తలులు ప్రవక్తల పునాదిపై (2)
పరిశుద్ధాలయముగా దేవుని వాసముగా (2)
ఆత్మమూలముగా కట్టబడుచున్నాము (1)
7. దేవ నీవే మా కుమ్మరివి
జిగటవంటి వారము మేము
నీ హస్తములతో నీ పోలికలో రూపునిచ్చి (2)
మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి (2)
మహిమ నొందుచున్న దేవ సోత్రము (1)
Chorus:
Devudu chesina paniyaiyunnamu (1)
Kristunandu aayana chesina
paniyaiyunnamu (2)
1. Aadamu nibandhananu bhangamu chesina –
Doshamu valana marana daasyamulo nundaga (2)
Devuni kumarudu gorrapillayai (2)
Praanamichchi prayaaschittamu chesenu (1)
2. Israyelu aigupthu daasyamulo nundi
Nitturputo mulugu liduchu morrapettaga (2)
Paralokamu nundi digivachchi devudu (2)
Vidipinchi vaarini nadipinchenu (1)
3. Aparaadhamulache paapamulache
chachhina vaaramai
Ugratha paarthulamai yuntimi (2)
Devudu tana mahaa prema cheta (2)
Kristuto kooda bratikinchenu (1)
4. Devuni krupaa
mahadaishwaryamunu batti
Rakthamu dwaara
aparaadhamulanu kshaminchenu (2)
Devuni chittamaina sankalpamunu batti (2)
Tana svasthyamuga yerparachenu (1)
5. Doorasthulaina manala kristu yesu nandu
Rakthamu valana sameepasthuluga chesenu
Madyapu godanu padagotti manala
Israyeluto ekamu chesenu (1)
6. Kristu yesu mukhyamaina
moolaraayiyai yundaga
Apostululu pravakthala punaadipi
Parishuddhalayamuga devuni vaasamuga
Aatmamulamuga kattabaduchunnamu (1)
7. Deva neeve maa kummarivi
jigtavanti varamu memu
Nee hastamulato nee polikalo roopunichchi (2)
Manti ghatamulalo mahimaishwaryamu nimpi (2)
Mahima nonduchunna deva sotramu (1)
