పల్లవి:
ప్రభువైన క్రీస్తుకు దాసులారా
పరిపూర్ణమనస్సుతో ప్రభును సేవించుడి (2)
అను పల్లవి:
తన సన్నిధిలో నిలచుటకును
శ్రద్ధగాను కొలచుటకును (2)
మిమ్మును ప్రభు ఎన్నుకొనెను (2)
1. పాపము వలన గత కాలమున
సాతానునకు దాసులమై యుంటిమి (2)
పాపక్షమాపణ క్రీస్తులో పొంది
సాతాను చెరనుండి విడుదల నొంది (2)
ధన్యులమైతిమి – క్రీస్తుకు దాసులమైతిమి
2. మీ తలాంతులని వాదుడి ప్రభుకై
రెండంతలుగ వృద్ధి చేయుడి (2)
నమ్మకమైన నిజ దాసులుగా
తన పరిచర్య చేయుడి నిరతము (2)
ఘనతను పొందెదరు – మీరు
తన సన్నిధియందున
3. యెహోవానే మీరు సేవించుచుందుడి
వేరెవ్వరిని ఇక సేవించకుడి (2)
పొలములో పంటలు పండకయున్నను
సాలలో పశువులు లేకపోయినను (2)
సర్వదా సేవించుచు – మీరు
ప్రభువులో హర్షించుడి
4. సర్వము ప్రభుకై అర్పించుకొని
ఆసక్తిగా తన సేవ చేయుడి (2)
ఘనమైన ఈ గొప్ప భాగ్యము
గమనము చేయుడి మీ బాధ్యత ఇదే (2)
వ్యర్థము కానేరదు – ప్రభునందు
మీ ప్రతి ప్రయాసము
5. ప్రభువు త్వరగా రానైయున్నాడు
నిద్రించువారు విడువబడెదరు (2)
మెళకువగా నుండు దాసులైయుండి
తన చిత్తమును జరిగించుచుండుడి (2)
జీతము తానిచ్చును – మీకు
మీ క్రియల ప్రతిఫలముగా
Chorus:
Prabhuvaina kristuku daasulara
Paripoornamanassuto
prabhunu sevinchudi (2)
Pre Chorus:
Tana sannidhilo nilachutakunu
Shraddhaganu kolachutakunu (2)
mimmunu prabhu ennukonenu (2)
1. Paapamu valana gatha kaalamuna
saatanunaku daasulamai yuntimi (2)
Paapakshamapana kristulo pondi
saatanu cheranundi vidudala nondi (2)
Dhanyulamaitimi – kristuku
daasulamaitimi
2. Mee talantulani vaadudi prabhukai
rendantaluga vruddhi cheyudi (2)
Nammakamaina nija daasuluga
tana paricharya cheyudi niratamu (2)
Ghanatanu pondedaru – meeru
tana sannidhiyanduna
3. Yehovane meeru sevinchuchundudi
verevvarini ika sevinchakudi (2)
Polamulo pantalu pandakayyunnanu
saalalo pashuvulu lekapoyinanu (2)
Sarvada sevinchuchu – meeru
prabhuvulo harshinchudi
4. Sarvamu prabhukai arpinchukoni
aasaktiga tana seva cheyudi (2)
Ghanamainaadendo ee goppa bhagyamu
gamanamu cheyudi mee badhyata ide (2)
Vyarthamu kaneradu – prabhunandu
mee prathi prayaasamu
5. Prabhuvu tvaraga ranaiyunnadu
nidrinchuvaaru viduvabadedaru (2)
Melakuvaga nundu daasulaiyundi
tana chittamunu jariginchuchundudi (2)
Jitamu taanichhunu – meeku
mee kriyala pratiphalamuga
