• TELUGU

  • ENGLISH

  • PLAY MEDIA


పల్లవి: దేవుడు చేసిన పనియైయున్నాము (1)
క్రీస్తునందు ఆయన చేసిన
పనియైయున్నాము (2)


1. ఆదాము నిబంధనను భంగము చేసిన
దోషము వలన మరణ దాస్యములో నుండగా (2)
దేవుని కుమారుడు గొట్టెపిల్లయై (2)
ప్రాణమిచ్చి ప్రాయశ్చిత్తము చేసెను (1)
|| దేవుడు ||

2. ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండి
నిట్టూర్పులతో మూలుగు లిడుచు మొఱ్ఱపెట్టగ (2)
పరలోకము నుండి దిగివచ్చి (2)
దేవుడు విడిపించి వారిని నడిపించెను (1)
|| దేవుడు ||

3. అపరాధములచే పాపములచే చచ్చిన వారమై
ఉగ్రత పాత్రులమై యుంటిమి (2)
దేవుడు తన మహా ప్రేమ చేత (2)
క్రీస్తుతో కూడ బ్రతికించెను (1)
|| దేవుడు ||

4. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి
రక్తము ద్వారా అపరాధములను క్షమియించెను (2)
దేవుని చిత్తమయిన సంకల్పమును బట్టి (2)
తన స్వాస్థ్యముగా ఏర్పరచెను (1)
|| దేవుడు ||


5. దూరస్థులైన మనల క్రీస్తుయేసు నందు
రక్తము వలన సమీపస్తులుగా చేసెను (2)
మద్యపు గోడను పడగొట్టి మనల (2)
ఇశ్రాయేలుతో ఏకము చేసెను (1)
|| దేవుడు ||

6. క్రీస్తుయేసు ముఖ్యమైన మూలరాయియై యుండగా
అపోస్తలులు ప్రవక్తల పునాదిపై (2)
పరిశుద్ధాలయముగా దేవుని వాసముగా (2)
ఆత్మమూలముగా కట్టబడుచున్నాము (1)
|| దేవుడు ||

7. దేవ నీవే మా కుమ్మరివి జిగటవంటి వారము మేము (2)
నీ హస్తములతో నీ పోలికలో రూపునిచ్చి (2)
మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి
మహిమ నొందుచున్న దేవ సూత్రము (1)
|| దేవుడు ||

You may also like