• TELUGU

  • ENGLISH

"క్రీస్తు దేవుని శక్తి"
(1 కొరింధీయులకు 1 : 24)

పల్లవి:
యేసు క్రీస్తు దేవుని శక్తియు -
జ్ఞానమునైయున్నాడు (2)


1. సిలువ వార్త నశించువారికి -
వెర్రితనము-గా నున్నది (2)
రక్షింపబడువారికి - అది దేవుని శక్తి (2)
నమ్మువారిని రక్షించుట (2)
దేవుని దయా - సంకల్పమాయెను (2)
|| యేసు ||

2. మనలా రక్షింప - అనాది నుండి -
దేవుని సంకల్పమైయున్నది (2)
తన కుమారుని - అర్పించే దేవుడు (2)
ఆయనే మనకు జ్ఞానము నీతి (2)
పరిశుద్ధత విమోచనమాయెను (2)
|| యేసు ||

3. మన విశ్వాసమునకు - దేవుని శక్తిని -
ఆధారముగా చేసికొనుడి (2)
మానవ జ్ఞానము విడిచిపెట్టుడి (2)
పరిశుద్ధాత్మతో - దేవుని శక్తిని (2)
దేవుని పనిలో వినియోగించుడి (2)
|| యేసు ||

4. దేవుడు మనలను - తన సంఘములో -
జతపనివారుగాను చేసె (2)
పనివాడు కష్టము కొలది - జీతము పొందును (2)
మనము దేవుని వ్యవసాయమును (2)
దేవుని గృహమునై యున్నాము (2)
|| యేసు ||

5. దేహము దేవుని వలన - అనుగ్రహింపబడి -
పరిశుద్ధాత్మకు ఆలయమాయెను (2)
మీరు మీ సొత్తుకారు - విలువపెట్టి కొనబడినారు (2)
మీ దేహములతో - దేవుని మహిమపర్చి (2)
రాకడ కొరకు కనిపెట్టుచుండుడి (2)
|| యేసు ||


You may also like