839: మహా దేవుడ వీవే సర్వదర్శి | Maha Devuda Veevey Sarva Darshi
పల్లవి:
మహాదేవుడ వీవే (2)
సర్వదర్శి – సర్వజ్ఞాని (2)
సర్వవ్యాపి- యేసు నీవే (2)
1. నీదు కార్యముల్ అద్భుతముల్
గొప్పది నీ ఆలోచన
నీదు సంకల్పం బలమైనది –
సర్వ సృష్టికి కర్తవు నీవే
(నీవే సర్వమందు ఉన్నవాడవు – 2)
2. గత దినములు స్మరియించగా
గొప్పది నీ విశ్వాస్యత
మమ్ము కాపాడి సంరక్షించితివి
దయా కిరీటము మాకిచ్చితివి
(మమ్ము ఆనందింపజేసితివి – 2)
3. విడచితిమి ప్రత్యేకతను
ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి
సంఘ క్రమమును లెక్కచేయక
ఆత్మీయముగా నష్టపోతిమి
మాదు నెపములను బాపుము
(మమ్ము క్షమించి, సరిచేయుము – 2)
4. రానున్న దినములలో
స్థిరముగా నుండ దయచూపుము
నన్ను నీకే అర్పించుకొందున్
నీదు మాటకు లోబడెదన్
(నేడే నాతో మాట్లాడుము – 2)
5. మహా మహిమతో వచ్చెదవు
లోకము నిన్ను చూడజాలదు
సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము
ఇతరులను సిద్ధపరచెదన్,
(నిన్నే బహుమానముగా పొందెదన్ – 2)
Chorus:
Maha devudaveeve (2)
sarvadarshi – sarvajnani (2)
Sarvavyapi – yesu neeve (2)
1. Needu kaaryamul adbhutamul
goppadi nee alochana
Needu sankalpam balamainadi
Sarva srushtiki kartavu neeve
(neeve sarvamandu unnavadavu – 2)
2. Gatha dinamulu smarinchaga
goppadi nee vishwasayata
Mammu kaapadi samrakshinchitivi
Daya kiritamu maakichitivi
(mammu aanandimpachesitivi – 2)
3. Vidachitimi pratyekatanu
ennosarlu ninnu duhkha pettitimi
Sangha kramamunu lekkacheyaka
aatmiyamuga nashtapotimi
Maadu nepamulanu baapumu
(mammu kshaminchi, saricheyumu – 2)
4. Raanunna dinamulalo
sthiramuga nunda daya choopumu
Nannu neeke arpinchukondun –
Needu maataku lobadedan
(nede naatho matladumu – 2)
5. Maha mahimatou vachchedavu
lokamu ninnu choodajaladu
Sampoornamuga nannu siddhaparachumu
Itarulanu siddhaparachedan
(ninnee bahumanamuga pondedan – 2)
