865: అర్పింతు ప్రభువా నా జీవితం | Arpintu prabhuva naa jeevitam
పల్లవి:
అర్పింతు ప్రభువా నా జీవితం
సామర్థ్యము గల నీ చేతిలో
నిన్ను మహిమ పరచ
అర్హపాత్రగా చేయుము నన్ (2)
1. నే మట్టిని నీవు కుమ్మరివి
నీ సామర్థ్య హస్తముతో లేపు (2)
అయోగ్యతలన్నీ తొలగించి
నీ కోర్కె చొప్పున నన్ను చేయు
నిన్ను మహిమపరచ గోరితిన్ ప్రభువా,
యోగ్య పాత్రగ చేయుము నన్ (2)
2. నే నిష్ఫల అంజూరపు చెట్టున్
నా చుట్టూ కంచెను కోల్పోతిన్
కానరాలేదు ఫలమేమి నాలో
వ్యర్థపరచితిని భూమిన్
నా చుట్టూ త్రవ్వి ఎరువేయుము ప్రభువా,
ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము
3. నే అణచబడిన చిన్న చెట్టున్
ముండ్ల పొదల మధ్య పడితిన్
ధనసుఖ ఆశల ద్వారా
అణచబడితిని నేను
నానుండి ముండ్లను తీయుము ప్రభువా,
నూరంతలుగా నే ఫలియింప
4. నా యెడల శాంతము చూపితివి
మరి యొక్క వత్సరమిచ్చితివి
తోట మాలిగా నాకై వేడితివి
తప్పించితివి తీర్పునుండి
వ్యర్థతీగెలను నరికి వేయు ప్రభువా,
నే ఫలియించి నిను ఘనపరచ
Chorus:
Arpintu prabhuvaa naa jeevitam
saamarthyamu gala nee chetilo
Ninnu mahima paracha
arhapatraga cheyumu nan (2)
1. Ne mattini neevu kummarivi
nee saamarthya hastamuto lepu (2)
Ayogyatalanni tolaginchi
nee korke choppuna nannu cheyu
Ninnu mahimaparacha goritin prabhuvaa,
Yogya patraga cheyumu nan (2)
2. Ne nishphala anjoorapu chettun
naa chuttu kanchenu kolpotin
Kaanaraaledu phalemi nalo
vyarthaparachitini bhoomin
Naa chuttu travvi eruveyumu prabhuvaa,
Phalamicche yogyata naakimmu
3. Ne anachabadina chinna chettun
mundla podala madhya paditin
Dhanasukha aashala dwaara
anachabaditini nenu
Naanundi mundlanu teeyumu prabhuvaa,
Noorantaluga ne phaliyimpa
4. Naa yedala shaantamu choopitivi
mari yokka vatsaramichitivi
Tota maaliga naakai veditivi
tappinchitivi teerpunundi
Vyarthateegelanu nariki veyu prabhuvaa,
Ne phaliyinchi ninu ghanaparacha
