పల్లవి:
నా ప్రాణ ప్రియుడా యేసురాజా-
అర్పింతును నా హృదయార్పణ (1)
విరిగి నలిగిన ఆత్మతోను –
హృదయపూర్వక ఆరాధనతో – సత్యముగా (1)
1. అధ్భుతకరుడా ఆలోచన –
ఆశ్చర్య సమాధాన ప్రభువా (2)
బలవంతుడా బహు ప్రియుడా
మనోహరుడా మహిమరాజా –
స్తుతించెదన్(1)
2. విమోచన గానములతో –
సౌందర్య ప్రేమ స్తుతులతో (2)
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను నా ప్రభువా (1)
3. గర్భమున పుట్టిన బిడ్డను –
కరుణింపక తల్లి మరచునా (2)
మరచిన గాని నీవెన్నడు
మరువవు విడివవు ఎడబాయవు –
కరుణారాజా (1)
4. రక్షణాలంకారములను –
అక్షయమగు నీ యాహారమున్ (2)
రక్షకుడా నా కొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు –
స్తుతింతును (1)
5. నీ నీతిని నీ రక్షణను –
నా పెదవులు ప్రకటించును (2)
కృతజ్ఞతా స్తుతుల తోడ
నీ ప్రేమను నే వివరింతును –
విమోచకుడా (1)
6. వాగ్దానముల్ నాలో నెరవేరెన్ –
విమోచించి నా కిచ్చితివే (2)
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయ హల్లెలూయ –
హల్లెలూయ (1)
Chorus:
Naa praana priyuda yesurajaa
arpinthunu naa hrudayaarpana (1)
Virigi naligina aatmathonu
hrudayapoorvaka aaradhanatho
satyamuga (1)
1. Adbhutakaruda aalochana
aashcharya samaadhana prabhuvaa (2)
Balavanthuda bahu priyuda
Manoharuda mahimaraajaa
stutinchedan (1)
2. Vimochana gaanamulato
saundarya prema stuthilato (2)
Namaskarinchi aaraadhintun
Harsintunu nee paadedanu
naa prabhuvaa (1)
3. Garbhamuna puttina biddanu
karunimpaka talli marachuna (2)
Marachina gani nee vennadu
Maruvavu vidivavu edabaayavu
karunaraajaa (1)
4. Rakshanaalankaaramulanu
akshayamagu nee yaahaaramun (2)
Rakshakuda naa kosagithivi
Deekshato ninnu veekshinchuchu
stutinchunu (1)
5. Nee neetini nee rakshananu
naa pedavulu prakatinchunu (2)
Krutajnaatha stuthula toda
Nii premanu nee vivarintun
vimochakuda (1)
6. Vaagdaanamul naalo neraveraen
vimochinichi naa kichchitivi (2)
Paadedanu praharshintunu
Halleluya halleluya
halleluya (1)
