846: ఆహా ఆనందమే పరమానందమే | Aahaa Aanandame Paramaanandame
పల్లవి:
ఆహా ఆనందమే – పరమానందమే
ప్రియ యేసు – నొనగే నాకు
కొలతలేనిది – బుద్ధికందనిది
ప్రేమన్ వివరింప వీలగునా?
నీచ ద్రోహినైన నన్
ప్రేమతో చేర్చుకొని
పాప ఊబి నుండి సన్
పైకి లేవనెత్తెను
2. నలిగిన రెల్లువలే
నేను విరిగెడు సమయములో
నాకై విజ్ఞాపన చేసి
స్థిరపరచితివి ప్రేమతో
3. కారు చీకటివేళలో
కలత చెందిన నన్ను
కాచి ఓదార్చితివే
బలమైన నీ ఆత్మతో
4. నాడు ప్రాణనాధుడా
నిన్నెప్పుడు నే గంతునో
ఆత్మప్రియుడా నిన్ను
చూడ ఆశ నాలో కలిగెను
5. నీ ప్రేమ స్వరమున్ విని
నేను మేలుకొంటిని
ప్రియుని రొమ్మును చేరను
నాలో వాంఛ ఉప్పొంగుచుండె
Chorus:
Aaha anandame – paramaanandame
priya yesu – nosage naaku
Kolatalenidi – buddhikandanidi
premann vivarimpa – veelaguna?
Necha drohinina nann
preamatho cherchukoni
Paapa oobi nundi san
paiki levanettenu
2. Naligina relluvule
nenu virigedu samayamulo
Naakai vignapan chesi
sthiraparachitivi prematho
3. Karu cheekativelalo
kalatha chendina nannu
Kachi odarchitive
balamaina nee aatmatho
4. Naadu praananadhudaa
ninneppudu ne gantuno
Aatmapriyudaa ninnu
chooda aasha naalo kaligenu
5. Nee prema swaramun vini
nenu melukontini
Priyuni rommunu cheranu
naalo vancha upponguchunde
